![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఎటో వెళ్ళిపోయింది మనసు'. ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -6లో.. రామలక్ష్మి భోజనం చేయబోతు ఆగిపోతుంది. కొంతమంది తాగుబోతులు తన మీద చెయ్యి వేస్తూ అల్లరి చేసిన విషయం గుర్తుకు చేసుకొని బాధపడుతుంటే.. ఏమైందని వాళ్ళ అమ్మ అడుగుతుంది. దాంతో ఏడుస్తూ జరిగింది మొత్తం చెప్తుంది. తన బాధ చూడలేక వాళ్ళ అమ్మ బాధపడుతుంది. ఇప్పుడు ఈ రోజుల్లో అవి సహజం. దానికే ఏడవాల అని మాణిక్యం అంటాడు. నీకెందుకు క్యాబ్? ఏదైనా సూపర్ మార్కెట్ చూసుకోమని ధన అంటాడు.
ఆ తర్వాత వాళ్ళ అమ్మ కోపంగా.. మీకోసం కష్టపడి సంపాదిస్తుంటే మీకేం తెలుస్తుందని వాళ్లపై అరుస్తుంది. ఇక నిన్ను ఎవరు పట్టించుకోరు.. నేనే ఏదో ఒకటి చేసి నీకు కష్టం లేకుండా చూడాలి. మీ నాన్నకి బుద్ధి వచ్చేలా నీ బతుకుని దారిలో పెడతానని వాళ్ళ అమ్మ అంటుంది. మరొకవైపు సిరి తన అన్నయ్య సీతాకాంత్ దగ్గరికి వచ్చి.. నువ్వు ఇంతవరకు పెళ్లి ఎందుకు చేసుకోలేదు అన్నయ్య అని అడుగుతుంది. మనం చాలా కష్టాల్లో ఉన్నాం. మీరు చిన్నగా ఉన్నారు జీరో నుండి మొదలై ఇప్పటి వరకు సాధించాను. ఈ బాధ్యతలో పెళ్లి అనే ఆలోచన రాలేదని సీతాకాంత్ అంటాడు. అతను వెళ్ళిపోయాక మాకోసం ఇంత చేస్తావ్ కదా.. నీకు పెళ్లి చేస్తాం.. నాకు కాబోయే వదినమ్మ ఎక్కడుందో వెతుకుతానని సిరి అనుకుంటుంది. ఆ తర్వాత మాణిక్యానికి తెలియకుండా రామలక్ష్మి వాళ్ళ అమ్మ రామలక్ష్మికి పెళ్లి చూపులు అరెంజ్ చేస్తుంది. అబ్బాయి వాళ్ళు వచ్చి.. మాకు అమ్మాయి నచ్చిందని చెప్తారు. అప్పుడే మాణిక్యం వచ్చి వాళ్ళ ముందే తాగుతు వాళ్ళని బయటకు గెంటేస్తాడు. ఏం చేస్తున్నారని అతని భార్య అడుగుతుంది. నా కూతురికి పెళ్లి చెయ్యను.. ఇప్పటికీ.. ఎప్పటికి అని స్వార్థంగా మాట్లాడతాడు. దానికి పెళ్లి చేస్తే మీకు కష్టం చేసి డబ్బులు ఎవరిస్తారు అనే కదా అని అతని భార్య తిడుతుంది.
ఆ తర్వాత రామలక్ష్మి తన అమ్మ ఒడిలో పడుకొని బాధపడుతుంది. మరుసటిరోజు మాణిక్యం తన ఫ్యామిలినీ తీసుకొని తన స్నేహితుడి కూతురి ఎంగేజ్ మెంట్ కి వెళ్తాడు. అక్కడ పెళ్లి కొడుకు ని చూసి రామలక్ష్మి తన చెల్లెలు నవ్వుకుంటారు కానీ మాణిక్యం మాత్రం మంచి అల్లుడిని తీసుకొని వచ్చావని అంటాడు. ఆ తర్వాత మా సర్ వచ్చేవరకు ఆగండి అని పెళ్లి కొడుకు అంటాడు. ఆ సర్ ఎవరో కాదు సీతాకాంత్.. అతను వచ్చి వాళ్ళ ఇంటి ముందు వరకు వస్తాడు. ఆ పెళ్ళికి వచ్చిన మాణిక్యాన్ని సీతాకాంత్ చూస్తాడా? రామలక్ష్మి, సీతాకాంత్ ఒకరినొకరు చూసుకోగలరా తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |